గురువారం 28 మే 2020
Telangana - May 01, 2020 , 15:36:21

సరిహద్దు చెక్‌పోస్టును తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

సరిహద్దు చెక్‌పోస్టును తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

నారాయణపేట : జిల్లాలోని ఎక్‌లాస్‌పూర్‌ గ్రామంలో ఉన్న తెలంగాణ-కర్ణాటక సరిహద్దు చెక్‌పోస్టును రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. సరిహద్దు ప్రాంతం కావునా రాకపోకల విషయంలో పటిష్ట నిఘా అమలు చేయాలని పేర్కొన్నారు. అంతకుక్రితం మంత్రి ఎక్‌లాస్‌పూర్‌ గ్రామంలో ఉపాధిహామీ కూలీలకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. నారాయణపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. logo