గురువారం 02 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 14:35:58

మోతెలో సినీ నటుడు శ్రీకాంత్‌ సందడి ..

మోతెలో సినీ నటుడు శ్రీకాంత్‌ సందడి ..

సిద్దిపేట : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలో ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్‌ సోమవారం సందడి చేశారు. గ్రామంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాంత్‌ను చూసిన జనం ఎగబడి సెల్ఫీలు దిగారు. కరోనా నేపథ్యంలో షేక్‌హ్యాండ్‌ ఇవ్వకుండా భౌతిక దూరం పాటిస్తూ శ్రీకాంత్‌ పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత మారుమూల గ్రామంలో విశిష్టత కలిగిన ఆలయం ఉండడం సంతోషకరమని, తాను ఇక్కడికి రావడం ఇదే తొలిసారి అని అన్నారు. ఇక్కడ వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం యావత్‌ భారతదేశాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసే విధంగా జనం ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం గ్రామ సర్పంచ్‌ శ్రీకాంత్‌కు శాలువా కప్పి సన్మానం చేశారు. 


logo