మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 18, 2020 , 01:28:26

కల్యాణం.. కమనీయం

కల్యాణం.. కమనీయం

  • వైభవంగా ‘మైహోం’ వేంకటేశ్వరస్వామి కల్యాణం

మేళ్లచెర్వు: సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులోని మైహోం ఇండస్ట్రీస్‌ ఆవరణలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని మంగళవారం కన్నులపండువగా నిర్వహించారు. శ్రీత్రిదండి చిన జీయర్‌స్వామి, అహోబిల రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో ఈ వేడుక అంగరంగ వైభవంగా సాగింది. మైహోం గ్రూప్స్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు-శ్రీకుమారి దంపతులు స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచ నం, కంకణధారణ, యజ్ఞోపవీతం, కన్యాదా నం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను వేదపండితులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. logo
>>>>>>