శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 17:13:04

విన‌రా విన‌రా ఓ న‌రుడా...ఎక్కడ చూసినా కాల‌జ్ఞానమే!

విన‌రా విన‌రా ఓ న‌రుడా...ఎక్కడ చూసినా కాల‌జ్ఞానమే!

కరోనా మహమ్మారి జనాన్ని కలవరపెడుతున్నది. గతంలో ప్లేగు, కలరా వ్యాధుల తర్వాత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న వ్యాధి కరోనానే. ఇదంతా  వీరబ్ర‌హ్మేంద్ర‌స్వామి చెప్పినట్టే జరుగుతున్నదని జనం నమ్ముతున్నరు. ఎన్టీ రామారావు నటించిన వీరబ్ర‌హ్మేంద్ర‌స్వామి కాల‌జ్ఞానం సినిమాకు గిరాకీ పెరిగింది. యూట్యూబ్‌లో ఆ సినిమాను జనం విపరీతంగా చూస్తున్నారు. దీనికి తోడు దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో టీవీ, ఇంటర్నెట్‌లో కాలక్షేపం చేస్తున్నారు. తాజా పరిస్థితిని కాల‌జ్ఞానంతో పోల్చుకుని చర్చోపచర్చలు చేస్తున్నారు. పల్లెలు, పట్టణాలు, ఎక్కడ చూసినా ఇదే చర్చ. అచ్చం బ్రహ్మంగారు చెప్పినట్టే జరుతోంది. లేకపోతే ఈ కరోనా ఏంటి, ఎప్పడూ ఊహించని ఈ అంతు చిక్కని వ్యాధి ఏంటి? అని మాట్లాడుకుంటున్నారు.

విన‌రా విన‌రా ఓ న‌రుడా బ్ర‌హ్మంగారి మాట పొల్లు పోదురా. కాల‌జ్ఞానం క‌ల్ల కాదురా. అంతుపొంతు లేని ఆప‌ద‌ల‌తో దేశం అల్ల‌క‌ల్లోలం అయిపోయేను. తిరుప‌తి వెంక‌న్న గుడి నాలుగు రోజులు పూజ‌లే లేక మూత‌ప‌డేను. తిరుప‌తి కొండ‌పై జ‌ల‌ధార పుట్టి అంద‌రికీ ఆధార‌మ‌య్యేను. అమెరికా దేశాన భూకంపం పుట్టి ప‌ట్ట‌ణాల‌కు చేటు తెచ్చేను. తెర‌మీద బొమ్మ‌లే ప‌రిపాల‌న‌లోకి వ‌చ్చి అధికారం చెలాయించేను. యాగంటి బ‌స‌వ‌య్య అంత‌కంత‌కూ పెరిగి క‌లియుగాంత‌మున రంకె వేసేను.  వితంతువు అధికారం చెలాయించేను.  కులం, మ‌తం పోయేను. వ‌ర్ణాంత‌ర వివాహాలు జ‌రిగేను".....ఇలా బ్ర‌హ్మంగారు చెప్పిన కాల‌జ్ఞానం వింటూ...ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని భ‌యం గుప్పిట్లో పెట్టుకున్న క‌రోనా గురించి క‌థ‌లుక‌థ‌లుగా చెప్పుకుంటున్నారు.

ఏది ఏమైనా కరోనా కష్టసమయంలో ఇంటర్నెట్‌ డాటా వినియోగం అమాంతం పెరిగిపోయింది.


logo