గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 16:06:17

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన శ్రీ రాపాక

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన  శ్రీ రాపాక

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్  ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  నటుడు కాదంబరి కిరణ్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్క్ లో నటి శ్రీ రాపాక మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వల్ల ఈ దేశానికి మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమమన్నారు.  మనందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు అవసరమన్నారు. కావున అందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని అన్నారు.

ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మరో ముగ్గురు డైరెక్టర్ లు రాంగోపాల్ వర్మ (RGV) , తేజ , ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్  లను ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.  కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ , ప్రతినిధి కిషోర్ గౌడ్ , నటుడు కాదంబరి కిరణ్ పాల్గొన్నారు.


logo