ఆదివారం 24 మే 2020
Telangana - Mar 23, 2020 , 21:13:00

నిరాడంబరంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

నిరాడంబరంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

భద్రాచలం, : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో ఈనెల 25 (బుధవారం) నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు నిరాడంబరంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బుధవారం ఉగాది పర్వదినం సందర్భంగా అర్చకులు నూతన పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. 29న ఉత్సవాంగ స్నపనం, 30న ధ్వజపట భద్రక మండల లేఖనం, గరుడాది వాసం, 31న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం నిర్వహిస్తారు. 

ఏప్రిల్‌ 2న శ్రీసీతారాముల తిరు కల్యాణోత్సవం, ఏప్రిల్‌ 3న శ్రీరామపట్టాభిషేకం జరపనున్నారు. ఇదిలా ఉండగా కరోనా నేపథ్యంలో మిథిలా ప్రాంగణంలో నిర్వహించాల్సిన రాములోరి కల్యాణం, శ్రీరామపట్టాభిషేకం మహోత్సవాలను భక్తులు లేకుండానే అర్చకులు ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. ఇతర ఉత్సవాలను సైతం ఆలయ ప్రాంగణంలోనే జరుగనున్నాయి.logo