బుధవారం 03 జూన్ 2020
Telangana - May 01, 2020 , 06:42:19

యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఏకాంత పూజలు

యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఏకాంత పూజలు

యాదగిరిగుట్ట : యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామికి నిత్యపూజలు వైభవంగా కొనసాగుతున్నాయి.  ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు 5.30 గంటలకు సుప్రభాత సేవలు నిర్వహించి, స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు.  ఉదయం 11.30 గంటలకు మహానివేదన నిర్వహించి ఆలయాన్ని మూసివేస్తారు. కొండపైన ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు, ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. సాయంత్రం 5.30 గంటలకు తెరిచి  రాత్రి ఏడు గంటలకు ఆరగింపు తదుపరి పవళింపు సేవ నిర్వహించి ఆలయాన్ని మూసివేస్తారు. 

కొనసాగుతున్న ఆన్‌లైన్‌ పూజలు..

లాక్‌డౌన్‌, కరోనా వైరస్‌ కారణంగా భక్తులను ఆలయంలోకి అనుమతించడం లేదు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆన్‌లైన్‌ పూజలు కొనసాగుతున్నాయి.  పలువురు భక్తులు తమ పేరిట హోమం, అభిషేకాలు, అర్చనలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోగా ఆలయ అర్చకులు వారి గోత్ర నామాల పేరిట పూజలు చేశారు. logo