గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 17:01:30

తిరుమలలోని కోదండరామాలయంలో శ్రీరామనవమి ఆస్థానం

తిరుమలలోని కోదండరామాలయంలో శ్రీరామనవమి ఆస్థానం

తిరుమల: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం ఏకాంతంగా జ‌రిగింది. ఇందులో భాగంగా ఉద‌యం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి మూల‌మూర్తుల‌కు అభిషేకం, ఉత్స‌వ‌మూర్తుల‌కు స్న‌ప‌న‌తిరుమంజం నిర్వ‌హించారు.  సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామివారి త‌ర‌ఫున ఏకాంగులు నూతన వస్త్రాలను విమానప్రదక్షిణగా తీసుకొచ్చి స్వామివారి మూలవర్లకు, ఉత్సవర్లకు సమర్పించారు. ఆ తరువాత శ్రీరామ జన్మపురాణం వివరించి, ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, ఆల‌య డిప్యూటీ ఈవో శాంతి, సూప‌రింటెండెంట్ ర‌మేష్‌ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఏప్రిల్ 3న శ్రీ సీతారాముల కల్యాణం ర‌ద్దు

శ్రీ‌రామ‌న‌వ‌మి ఉత్స‌వాల‌ సంద‌ర్భంగా ఏప్రిల్ 3వ తేదీన జ‌ర‌గాల్సిన శ్రీ సీతారాముల‌ కల్యాణాన్ని టీటీడీ ర‌ద్దు చేసింది. క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నట్లు ఈవో ప్రకటించారు. 


logo