గురువారం 16 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 18:04:29

ఎస్ఆర్ యూనివ‌ర్సిటీ వీసీగా డాక్ట‌ర్ జీఆర్సీ రెడ్డి

ఎస్ఆర్ యూనివ‌ర్సిటీ వీసీగా డాక్ట‌ర్ జీఆర్సీ రెడ్డి

హైద‌రాబాద్ : వ‌రంగ‌ల్ జిల్లా హ‌స‌న్ ప‌ర్తి మండ‌లం అనంత‌సాగ‌ర్ లో ఏర్పాటైన ఎస్ఆర్ యూనివ‌ర్సిటీ వీసీగా డాక్ట‌ర్ జీఆర్సీ రెడ్డి నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు యూనివ‌ర్సిటీ యాజ‌మాన్యం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఎస్ఆర్ యూనివ‌ర్సిటీ మొట్ట‌మొద‌టి వీసీగా నియామ‌కం కావ‌డం సంతోషంగా ఉంద‌ని రెడ్డి తెలిపారు. ఇండియాలోని 160 విద్యాసంస్థ‌ల్లో ఈ యూనివ‌ర్సిటీ టాప్ లో నిల‌వ‌డ‌మే కాకుండా, తెలంగాణ‌లో టాప్ 5లో నిలిచింద‌న్నారు. 

డాక్ట‌ర్ జీఆర్సీ రెడ్డి.. ఎన్ఐటీ కాలిక‌ట్, ఎన్ఐటీ గోవా డైరెక్ట‌ర్ గా సేవ‌లందించారు. ఎన్ఐటీ వ‌రంగ‌ల్ ఇంఛార్జి డైరెక్ట‌ర్ గా విధులు నిర్వ‌ర్తించారు. ఎన్ఐటీ సిక్కిం, ఐఐఐటీ కొట్టాయం, ఎన్ఐటీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు మెంట‌ర్ డైరెక్ట‌ర్ గా, శార‌ద‌ యూనివ‌ర్సిటీ వీసీగా ప‌ని చేశారు. 


logo