ఆదివారం 24 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 09:42:44

బండి సంజయ్‌, అక్బరుద్దీన్‌పై కేసు

బండి సంజయ్‌, అక్బరుద్దీన్‌పై కేసు

హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్‌ ఓబైసీపై కేసు నమోదయ్యింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గాను ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు ఐపీఎస్‌ 505 సెక్షన్‌ కింద కేసు నమోదచేశారు. జీహెచ్‌ఎంసీ ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్‌ రోడ్‌ షోలో పాల్గొన్న బండి సంజయ్‌ దారుసలాం కూల్చివేస్తామని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్సేన్‌ సాగర్‌ కట్టపై మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సమాధి, ఎన్టీఆర్‌ ఘాట్‌ను కూల్చివేస్తామని అక్బరుద్దీన్‌ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరువురు నేతలపై సుమోటో కింద పోలీసుల కేసు రిజిస్టర్‌ చేశారు. 


logo