ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 14:16:31

మొలకెత్తిన విత్తనాలు..చిగురిస్తున్న ఆనందాలు

మొలకెత్తిన విత్తనాలు..చిగురిస్తున్న ఆనందాలు

ఆదిలాబాద్ : నైరుతి రుతుపవనాలతో సకాలంలో కురుస్తున్న వర్షాలు, సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో రైతుల్లో సంతోషాలను చిగురిపంజేస్తున్నది. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వం సూచించిన విధంగా నియంత్రిత సాగు విధానం ద్వారా 4 లక్షల ఎకరాల్లో పత్తి 93 వేల ఎకరాల్లో 75 వేల ఎకరాల్లో పంటలను రైతులు సాగుచేస్తున్నారు. జూన్ మొదటి వారం లో రైతులు జిల్లావ్యాప్తంగా పత్తి విత్తనాలు వేశారు. 75 శాతం రైతులు ఇప్పటికే విత్తనాలు వేయగా పలు గ్రామాల్లోని పత్తి విత్తనాలు మొలకెత్తాయి.

సీజన్ ప్రారంభం నుంచి వానలు క్రమంగా పడుతుండటంతో వేసిన విత్తనాలు మొలకలు వచ్చాయి. పంటలు కలుపు కూడా పెరగడంతో రైతులు కలుపు తీసే పనిలో ఉన్నారు. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన రైతులు ఈ సీజన్ తమకు కలిసి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.logo