e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home తెలంగాణ నీడలా వైరస్

నీడలా వైరస్

  • ఇంట్లో ఒకరికి వస్తే మిగిలినవారికి వ్యాప్తి
  • సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే కట్టడి
నీడలా వైరస్

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (నమస్తే తెలంగాణ): ఇంట్లో ఎవరైనా ఒకరు వైరస్‌ బారినపడితే అది అందరికీ అంటుకుంటున్నది. కరోనా సెకండ్‌లో ఇది కీలకమైన మార్పు అని వైద్యనిపుణులు చెప్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొన్ని ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

జాగ్రత్తలు ఇవీ..
మాస్క్‌ ఉతకడం: బయటికి వెళ్లి రాగానే మాస్క్‌ను వేడి నీటిలో ఉతకాలి.
శానిటైజ్‌ చేయడం: కిరాణ దుకాణానికో, కూరగాయలకో, ఉద్యోగానికి వెళ్లి ఇంటికి రాగానే ముందు చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి.
స్నానం చేయడం, బట్టలు ఉతకడం: బయటికి వెళ్లి వచ్చినవారు ముందు వేడినీటిలో బట్టలను ఉతికేసుకొని, స్నానంచేయాలి. తల వెంట్రుకల నుంచి కాలిగోటి వరకు అంతా శుభ్రంచేసుకోవాలి.
వస్తువులను సానిటైజ్‌చేయాలి: మనతోపాటు తీసుకెళ్లే సెల్‌ఫోన్‌, పర్స్‌, చేతి గడియారాల వంటివి ఇంటికి రాగానే శానిటైజ్‌చేయాలి.
బాత్‌రూంలోనూ మాస్క్‌: ఒకే బాత్‌రూం ఉంటే లోపలికి వెళ్లేప్పుడు ప్రతి ఒక్కరూ మాస్క్‌ పెట్టుకోవడం మంచింది.
లక్షణాలుంటే సపరేట్‌: తరచూ బయటికి వెళ్లి వచ్చేవారికి ఎవరికైనా లక్షణాలున్నట్టు అనిపిస్తే ఇంట్లోవారికి దూరంగా ఉండాలి.
లిఫ్టులు, మెట్లతో జాగ్రత్త: లిఫ్టులు, మెట్లు ఎక్కినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లిఫ్టులోని బటన్‌ను నొక్కగానే వెంటనే శానిటైజ్‌చేసుకోవాలి. భౌతికదూరం పాటించాలి. మెట్లు ఎక్కేసమయంలో రైలింగ్‌ను తాకకూడదు.
ఉప్పునీటిలో కూరగాయలు: బయటినుంచి తీసుకొచ్చిన కూరగాయలను ఉప్పునీటిలో అరగంట ఉంచి శుభ్రం చేసుకున్నాక ఫ్రిజ్‌లో పెట్టాలి. కూరగాయలను శుభ్రంచేసినవారు వెంటనే చేతులను కడుక్కోవాలి. కిరాణా సామగ్రి తదితరాలైతే సానిటైజ్‌చేసి భద్రపరచుకోవాలి.
నిత్యంవాడే వస్తువుల శానిటైజ్‌: ఇంట్లో రోజూ ఉపయోగించే టీవీరిమోట్‌, స్విచ్‌బోర్డులు, కుర్చీలు, సోఫాలు, ఫుట్‌మ్యాట్లు, నల్లాలను రెండ్రోజులకోసారైనా శానిటైజ్‌చేయాలి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదు. లక్షణాలు ఉన్నాయనుకుంటే మాత్రం రోజూ శుభ్రంచేసుకోవాలి.

వైరస్‌ టూల్‌ కిట్
ప్రతిఇంట్లో కరోనా టూల్‌ కిట్‌ ఉంచుకోవడం మంచిది. ఈ కింది వస్తువులను టూల్‌కిట్‌లో ఉంచుకోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.

  1. టెంపరేచర్‌ మానిటర్‌/థర్మామీటర్‌
  2. పల్స్‌ ఆక్సిమీటర్‌ (శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ 94కు మించి ఉండాలి. లేనిపక్షంలో వైద్యుడిని సంప్ర దించాలి)
  3. స్టీమర్‌ (శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది)
  4. పారాసిటమల్‌ ట్యాబ్లెట్‌
  5. యాంటీ ఆసిడ్‌ ట్యాబ్లెట్‌
  6. యాంటీ ఎలర్జిక్‌ ట్యాబ్లెట్‌ (సిట్రసిన్‌, వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి)
  7. థర్మల్‌ ప్లాస్క్‌ (రోజుకు ఐదారుసార్లు వేడినీరు తాగడానికి వాడుకోవచ్చు)
  8. ఇమ్యూనిటీ బూస్టర్‌ (తులసి, ఇలాచీ తదితరాలతో ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. లేదా ఇమ్యూనిటీ బూస్టర్లను కొనుగోలు చేసుకోవచ్చు)
  9. హల్దీవాలా దూద్‌ (పసుపుతో చేసిన పాలు)
  10. స్ట్రెచ్‌ బ్యాండ్‌ (వ్యాయామం చేయడానికి వినియోగించాలి)
నీడలా వైరస్

లక్షణాలుంటే దాచుకోవద్దు
బయటికి వెళ్లి రాగానే స్నానంచేసి ఓ గంట సేపు లాన్‌లో లేదా ఇంటి బయట నిలబడి బయటి గాలిని తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు మీ వస్తువులను ఇంట్లోవారిని తాకనివ్వకపోవడం మంచిది. కొన్ని రోజులవరకు మీ పనులు.. బట్టలు ఉతకడం, తిన్న ప్లేట్‌ను శుభ్రంచేయడం లాంటి పనులు మీరే చేసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, కొవిడ్‌ లక్షణాలు ఏమైనా ఉంటే ఇంట్లోవారికి ధైర్యంగాచెప్పాలి. దాచుకోకూడదు. అప్పుడే వారినుంచి మీకు అవసరమైన సహకారం లభిస్తుంది.

  • అన్వేష్‌, నిమ్స్‌ వైద్యుడు
Advertisement
నీడలా వైరస్
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement