గురువారం 09 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 21:09:04

పరీక్షా కేంద్రాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ

పరీక్షా కేంద్రాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ

ఆదిలాబాద్‌ రూరల్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో నిలిచిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను ఈనెల 8 నుంచి నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలల్లో పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌, తిరుపెల్లి ప్రభుత్వ పాఠశాలల్లో మున్సిపల్‌ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం స్ప్రే చేయించారు. ప్రతి తరగతి గదితో పాటు పాఠశాల పరిసరాల్లో పిచికారీ చేశారు. కేంద్రాల వద్ద శానిటైజర్లు, మాస్కులతో పాటు, సిబ్బంది కోసం గ్లౌస్‌లు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. logo