బుధవారం 03 జూన్ 2020
Telangana - May 15, 2020 , 08:17:26

లభించని చిరుత ఆచూకి...

లభించని చిరుత ఆచూకి...

హైదరాబాద్‌: కాటేదాన్‌లో నిన్న కనిపించి తప్పించుకున్న చిరుత పులి ఆచూకి ఇంకా లభించలేదు. నిఘా కెమెరాలతో చిరుత ఆచూకి కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. స్థానిక వ్యవసాయ క్షేత్రంలో చిరుత కాలి ముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. కాటేదాన్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో రైల్వే అండర్‌పాస్‌ వద్ద నిన్న ఉదయం 6 గంటల సమయంలో కనిపించిన చిరుతను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుభాన్‌ అనే ఓ లారీడ్రైవర్‌ చిరుత సమీపానికి వెళ్లటంతో అతనిపై దాడిచేసి గాయపర్చింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అటవీశాఖ అధికారులతో కలిసి చిరుతను బంధించేందుకు ప్రయత్నించగా తప్పించుకొని సమీపంలోకి చెట్లపొదల్లోకి వెళ్లిపోయింది. సాయంత్రం వరకు ప్రయత్నించినా అది పట్టుబడలేదు. 


logo