శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 02:03:45

అతి ఆలోచనలతోనే మానసిక ఒత్తిడి సద్గురు రమేశ్‌జీ

అతి ఆలోచనలతోనే మానసిక ఒత్తిడి సద్గురు రమేశ్‌జీ

హైదరాబాద్‌: ఓ వ్యక్తి, అంశం లేదా ఓ పరిస్థితి గురించి అతిగా ఆలోచించడం వల్లనే మానసిక ఒత్తిడికి గురవుతుంటామని, దీనిని అధిగమించడానికి ధ్యానం ఒక్కటే మార్గమని సద్గురు రమేశ్‌జీ పేర్కొన్నారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) శుక్రవారం సద్గురు రమేశ్‌జీతో ‘ఒత్తిడిని అధిగమించండి’ అంశంపై ఇష్టాగోష్టి నిర్వహించింది. ఈ సందర్భంగా రమేశ్‌జీ మాట్లాడుతూ.. మనస్సు ప్రశాంతంగా ఉంటేనే వినూత్నమైన బిజినెస్‌ ఐడియాలు వస్తాయని, సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చని, సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు రమాకాంత్‌ ఇనానీ, వైస్‌ ప్రెసిడెంట్‌ కే భాస్కర్‌రెడ్డి, అనిల్‌ అగర్వాల్‌, ఖ్యాతీ నరావణె, శేఖర్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.