శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 21:59:24

దసరా పండగ దృష్ట్యా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

దసరా పండగ దృష్ట్యా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌ : దసరా పండగ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రాంతాలకు మరిన్ని రైళ్లను నడపనుంది. కాకినాడ-లింగంపల్లి, తిరుపతి-లింగంపల్లి, నర్సాపూర్‌-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ నెల 20 నుంచి 30 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. కాకినాడ పోర్టు-లింగంపల్లి ప్రత్యేక రైలు ప్రతిరోజు రాత్రి 7.10 గంటలకు, లింగంపల్లి-కాకినాడ ప్రత్యేక రైలు ప్రతిరోజు రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కానుంది. తిరుపతి నుంచి లింగంపల్లికి ఉదయం 6.55 గంటలకు... లింగంపల్లి నుంచి తిరుపతికి సాయంత్రం 5.30 గంటలకు ప్రత్యేక రైలు నడవనుంది. అదేవిధంగా నర్సాపూర్‌-లింగంపల్లి ప్రత్యేక రైలు ఈ నెల 23 నుంచి ప్రతిరోజు సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరనుంది. లింగంపల్లి నుంచి నర్సాపూర్‌కు రాత్రి 9.05 గంటలకు ప్రత్యేక రైలు. విజయవాడ-హుబ్లీ, తిరుపతి-అమరావతి మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ నెల 21 నుంచి 30 వరకు విజయవాడ-హుబ్లీ మధ్య ప్రత్యేక రైలు నడవనుంది. 


logo