శనివారం 06 మార్చి 2021
Telangana - Jan 22, 2021 , 07:56:17

సికింద్రాబాద్‌, కరీంనగర్‌ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌, కరీంనగర్‌ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుపతికి సికింద్రాబాద్‌, కరీంనగర్‌కు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్నది. ఈ రైలు సర్వీసులు వచ్చే బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయని అధికారులు తెలిపారు. ఇందులోభాగంగా సికింద్రాబాద్‌-తిరుపతి ప్రత్యేక ‌(02732) రైలు ఈనెల 27న సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి బుధ, శనివారం సాయంత్రం 4.15 గంటలకు ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతుంది. తిరుపతి-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (02731) తిరుపతి నుంచి ఈనెల 28న ప్రారంభమవుతుంది. ఈ రైలు గురు, ఆదివారం సా యంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌-తిరుపతి స్పెషల్‌ (02770) సికింద్రాబాద్‌ నుంచి ఈనెల 26న మొదలవుతుంది. మంగళ, శుక్రవారం సాయంత్రం 5.40 గంటలకు ఇది ప్రారంభమవుతుంది. 

తిరుపతి-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (02769) తిరుపతి నుంచి ఈ నెల 29న ప్రారంభమవుతుంది. ప్రతి సోమ, శుక్రవారం సాయంత్రం 3.45గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. తిరుపతి-కరీంనగర్‌ స్పెషల్‌ (02761) తిరుపతి నుంచి ఈనెల 27న ప్రారంభమవుతుంది. బుధ, శనివారం రాత్రి 8.15 గంటలకు ఇది బయలుదేరుతుంది. కరీంనగర్‌-తిరుపతి స్పెషల్‌ (02762) కరీంనగర్‌ నుంచి ఈ నెల 28న మొదలవుతుంది. గురు, ఆదివారాల్లో రాత్రి 7.15 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది.  

VIDEOS

logo