గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 07:08:10

లింగంప‌ల్లి, సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

లింగంప‌ల్లి, సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

హై‌ద‌రా‌బాద్: ప్రయా‌ణి‌కుల రద్దీ నేప‌థ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరి‌ధిలో రెండు ప్రత్యేక రైళ్లను నడు‌ప‌ను‌న్నట్టు రైల్వే అధి‌కా‌రులు ప్రక‌టించారు. సికిం‌ద్రా‌బా‌ద్‌–‌ధ‌న‌పూర్‌, పూరి–‌య‌శ్వం‌త్‌‌పూర్‌ రైళ్లు ఈ నెల 6 నుంచి మార్చి 31 వరకు ప్రతి రోజు రాక‌పో‌కలు సాగిం‌చ‌ను‌న్నట్టు వెల్ల‌డిం‌చారు. సికిం‌ద్రా‌బాద్‌ నుంచి శ్రీకా‌కుళం రోడ్‌‌స్టే‌షన్‌ వరకు ఈ నెల 8నుంచి 16 వరకు (నం‌బర్‌ 07026) రైలు రాక‌పో‌కలు సాగి‌స్తుంది. తిరుగు ప్రయా‌ణంలో (రైలు నం.07025) 17వ తేదీ వరకు నడు‌స్తుంది. 

వెల్లి‌పు‌రం–‌తి‌రు‌పతి, తిరు‌ప‌తి–‌వె‌ల్లి‌పురం మధ్య ప్రత్యేక రైళ్లు రాక‌పో‌కలు సాగి‌స్తాయి. లింగం‌పల్లి నుంచి కాకి‌నాడ టౌన్‌ వరకు ప్రత్యేక రైలు ఈ నెల 12న నడు‌స్తుంది. ఈ నెల 9 నుంచి 31 వరకు విశా‌ఖ–‌లిం‌గం‌పల్లి మధ్య సూప‌ర్‌‌ఫాస్ట్‌ రైళ్లు, ఈ నెల 10 నుంచి ఫిబ్ర‌వరి 1 వరకు లింగం‌ప‌ల్లి–‌వి‌శాఖ మధ్య ప్రత్యేక రైళ్లు, ఈ నెల 11 నుంచి కాచి‌గూ‌డ–‌వి‌శా‌ఖ‌ రైలు న‌డువ‌నున్నాయి. ‌


logo