సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 06:35:27

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి పలు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి పలు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజన్‌ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ నుంచి మైసూర్‌ జంక్షన్‌ (02785) రాత్రి 7.05 గంటలకు బయలు దేరి, ఉదయం 9.35 గంటలకు చేరుకుంటుంది. తిరిగి మైసూర్‌లో 3.15 గంటలకు బయల్దేరి, కాచిగూడకు మరుసటి రోజు ఉదయం 5.40 గంటలకు చేరుకుంటుంది. హైదరాబాద్‌-హుబ్లీ (07320) రైలు మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి, ఉదయం 6.15 గంటలకు హుబ్లీకి చేరుకుంటుంది. వీటితో పాటు తెలంగాణ మీదుగా యశ్వంత్‌పూర్‌-లక్నో (02539), బీదర్‌-యశ్వంత్‌పూర్‌ (06272), యశ్వంత్‌పూర్‌-లాతూర్‌, (06583), మైసూర్‌ -బాల్‌కోట్‌ (07307) రైళ్లు నడుస్తున్నాయి.