శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 07:52:18

10 నుంచి లింగం‌ప‌ల్లి–‌వై‌జాగ్‌ ప్రత్యేక రైలు

10 నుంచి లింగం‌ప‌ల్లి–‌వై‌జాగ్‌ ప్రత్యేక రైలు

హైద‌రా‌బాద్‌ : సంక్రాంతి నేప‌థ్యం లో దక్షిణ మధ్య రైల్వే లింగం‌ప‌ల్లి–‌వై‌జాగ్‌ మధ్య ప్రత్యేక రైలు నడు‌ప‌ను‌న్నది. జన‌వరి 10 నుంచి ఫిబ్ర‌వరి 1వ‌రకు రైలు ప్రతి రోజూ సాయంత్రం 6.15 గంట‌లకు లింగం‌ప‌ల్లిలో బయ‌ల్దేరి మరు‌సటి రోజు రాత్రి 7.45 గంట‌లకు విశా‌ఖ‌పట్నం చేరు‌కుం‌టుంది. విశా‌ఖ‌పట్నంలో ఉదయం 6.20 గంట‌లకు బయ‌లు‌దేరి రాత్రి 7.40 గంట‌లకు లింగం‌ప‌ల్లికి చేరు‌కుం‌టుంది. లింగం‌ప‌ల్లిలో బయ‌ల్దేరే రైలు బేగం‌పేట, సికిం‌ద్రా‌బాద్‌, రామ‌న్న‌పేట, నల్ల‌గొండ, మిర్యా‌ల‌గూడ, నడి‌కుడి, పిడు‌గు‌రాళ్ల, సత్తె‌న‌పల్లి, గుంటూరు, తెనాలి, యల‌మం‌చిలి, అన‌కా‌పల్లి, దువ్వాడ మీదుగా వైజాగ్‌ చేరు‌కుం‌టుంది.