సోమవారం 18 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 01:54:36

బాలికల భద్రతకు ప్రత్యేక విభాగం

బాలికల భద్రతకు ప్రత్యేక విభాగం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బాలికల రక్షణకు, వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంచేందుకు ప్రత్యేక బాలికా విభాగాన్ని ప్రారంభించనున్నట్టు రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఇంచార్జి, అడిషనల్‌ డీజీ స్వాతిలక్రా చెప్పారు. ఈ విభాగానికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా వివిధ రంగాలకు చెందిన అద్వైతనాయుడు, కర్నీ రేణిత, కృతివెంటి హేమలత, శ్రీచందన, హన్సికలను ఎంపికచేసినట్టు తెలిపారు. మహిళలపై జరిగే హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం ‘మహిళా భద్రతకు భరోసా, బాధ్యత’ అనే అంశంపై మహిళా భద్రత విభాగం, తెలుగు మహిళా రచయితల ఫోరం, అక్షరయాన్‌ సంయుక్తంగా జూమ్‌యాప్‌ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నింగిని గెలిచిన నేల అనే 50 కథల సంపుటిని స్వాతిలక్రా, డీఐజీ సుమతి ఆవిష్కరించారు.