మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 21:38:46

అయోధ్యలో భూమిపూజ.. భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

అయోధ్యలో భూమిపూజ.. భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

భద్రాచలం : అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమిపూజ నేపథ్యంలో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడి ముఖ ద్వారం వద్ద ముందుగా స్వామి వారికి నిత్య కల్యాణం నిర్వహించారు. బేడా మండపం వద్ద విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం గావించారు. అనంతరం అగ్ని హోమం నిర్వహించారు. శ్రీరామయణ హవనం, శ్రీరామతారకోపనిషత్తు పారాయణం చేపట్టారు. పూజల్లో దేవస్థాన స్థానాచార్యులు స్థలశాయి, ప్రధాన అర్చుకులు సీతారామానుజాచార్యులు, ముఖ్య అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, శ్రీమన్నారాయణాచార్యులు పాల్గొన్నారు.logo