గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 14:54:48

లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

యాదాద్రి భువనగిరి : లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి  ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తామని ఫారెస్ట్  అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం గ్రామంలోని  అటవీ ప్రాంతంలో ఉన్న పురాతన లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.