శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 16:39:47

చెరువుల సుందరీకరణకు ప్రత్యేక చర్యలు

చెరువుల సుందరీకరణకు ప్రత్యేక చర్యలు

మేడ్చల్ : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్నచెరువులను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం, గాజులరామారం సర్కిల్‌, పరిధిలోని 129 సూరారం డివిజన్‌, రాజీవ్‌గాంధీనగర్‌ సమీపంలోని చెరువులోని గుర్రపు డెక్కను తొలగింపు పనులను ఆయన స్థానిక కార్పొరేటర్‌ మంత్రి సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువులు, కుంటలల్లో గుర్రపు డెక్కలు, ఇతర పిచ్చి మొక్కలు పెరగడంతో చెరువులన్నీ విషతుల్యంగా మారుతూ మత్స్య సంపదకు విఘాతం కలిగిస్తుందన్నారు. అలాంటి వాటికి తావునివ్వకుండా ఉండేందుకు సకాలంలో  గుర్రపుడెక్కను తొలగించి చెరువులకు పూర్వవైభవం తెచ్చేలా పక్కా ప్రణాళికలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. 

కార్యక్రమంలో శానిటేషన్‌ అదనపు కమిషనర్‌ రాహుల్‌రాజ్‌, గాజులరామారం ఉపకమిషనర్‌ రవీంద్రకుమార్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ డివిజన్‌ అధ్యక్షులు పుప్పాల భాస్కర్‌, డివిజన్‌ ప్రధాన కార్యదర్శి మధుమోహన్‌, సీనియర్‌ నాయకుడు చౌడ శ్రీనివాస్‌, కాలనీ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి, శ్రీనివాస్‌, వార్డు సభ్యులు జానకి రామ్‌, ఆంజనేయులు, లక్ష్మణ్‌, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  logo