బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 01:33:07

సిటీ ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి

సిటీ ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి

  • ఓఆర్‌ఆర్‌ బయట నివాస సముదాయాలు 
  • రోబస్ట్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ తేవాలి 

తెలంగాణలో 1.20 కోట్ల వాహనాలుంటే అందులో సగం హైదరాబాద్‌లోనే ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇప్పటికే వాహనాలతో హైదరాబాద్‌ గ్రిడ్‌లాక్‌ అయిపోయిందని చెప్పారు. ‘వాహనాలన్నీ తీసుకొచ్చి పెడితే ఇంచు కూడా జాగా ఉండదు. ఎఫిషియెంట్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం తేవాలి. ఇప్పటికే మనకు మెట్రో వచ్చింది. 69 కిలోమీటర్లు పూర్తయింది. మెట్రోలో వెళ్లేవారి సంఖ్య కూడా భారీగా పెరిగి 5 లక్షలకు చేరుకున్నది. మా అంచనా ప్రకారం త్వరలో మెట్రో ప్రయాణికుల సంఖ్య 15 లక్షలకు పెరుగుతుంది. దీంతోపాటు సమాంతరంగా ఫ్లైవోవర్లు, అండర్‌పాస్‌ బ్రిడ్జిలు వేయాలి. ఆర్టీసీ బస్సుల సంఖ్యను కూడా పెంచాలి. నిజాంపేట నుంచి ఐటీ కారిడార్‌ వరకు 18 కిలోమీటర్లు ఎలివేటెడ్‌ బీఆర్‌టీఎస్‌కు ప్రణాళిక వేస్తున్నాం’ అని తెలిపారు.

ఓఆర్‌ఆర్‌ బయట నివాస సముదాయాలు పెంచాలి 

అర్బనైజేషన్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నదని కేటీఆర్‌ అన్నారు. ‘మెరుగైన ఉపాధి, విద్యావకాశాలు, వైద్యం కోసం ప్రజలు పట్టణాలకు వస్తున్నారు. ఎక్కడి నుంచైతే పట్టణాలకు వస్తున్నారో అక్కడే ఈ సౌకర్యాలు కల్పించాలి. రెండోది అర్బనైజేషన్‌కు తోడుగా సబ్‌ అర్బనైజేషన్‌ను కూడా ప్రమోట్‌ చేయాలి. ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటీవలే ప్రత్యేక పాలసీ తీసుకొచ్చాం. ఓఆర్‌ఆర్‌కు 5 కిలోమీటర్ల అవతల కనీసం 100 ఎకరాల విస్తీర్ణంలో లైవ్‌, వర్క్‌, లివ్‌, ప్లే మోడ్‌లో డెవలప్‌ చేస్తే అక్కడి వారికి ఉపాధి లభిస్తుంది. హైదరాబాద్‌లో ఫ్లాట్‌ కొనలేని వారు.. శివార్లకు వెళితే విల్లాను కొనుగోలు చేయొచ్చు’ అని చెప్పారు. 

రోబస్ట్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ తేవాలి 

హైదరాబాద్‌ ఒక గ్లోబల్‌ సిటీ కావాలంటే మాత్రం పర్మినెంట్‌ సొల్యూషన్‌ ఒకటి ఉన్నదని కేటీఆర్‌ అన్నారు. ‘హైస్పీడ్‌ ట్రైన్‌ నెట్‌వర్క్‌ ఇప్పుడు ప్రపంచమంతా వస్తున్నది.  గంటకు 170- 200 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్‌ రైళ్లు, హైస్పీడ్‌ రైళ్లు వస్తున్నాయి. భారత్‌లో కూడా ఐదేండ్లకో పదేండ్లకో వచ్చేస్తాయి. అప్పుడు కరీంనగర్‌లో ఉంటే గంటలో హైదరాబాద్‌కు రావొచ్చు.. పోవచ్చు. అన్ని రకాల కాంబినేషన్‌లో ట్రాన్స్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తే అప్పుడు హైదరాబాద్‌ డీ కంజెస్ట్‌ అవుతుంది’ అని చెప్పారు. ‘మెట్రోకు ప్రభుత్వ పరంగా ఖర్చు చేసింది రూ.3,000 వేల కోట్లు. కేంద్రం ఇచ్చింది రూ.1,400 కోట్లు. మిగతాది ప్రైవేటు డెవలపర్స్‌తో పెట్టించాం. హైదరాబాద్‌ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం. ఎలివేటెడ్‌ బీఆర్టీఎస్‌కు కూడా పీపీపీలోనే వెళ్తాం. ఎయిర్‌పోర్టుకు మెట్రో కూడా అదే విధంగా నిర్మిస్తాం. ప్రభుత్వమే ప్రతిదానిలో డబ్బులు పెట్టాలనేది ఏమీ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు. ఒక పెట్టుబడిదారుడు ఇక్కడికి రావాలంటే ఇక్కడ శాంతి భద్రతలు ఉండాలి’ అన్నారు.

ఆరేండ్ల ప్రగతిని ప్రజల ముందుంచాం

మేం ఆరేండ్లలో మా ప్రగతిని చూపిస్తున్నాం. నగరాభివృద్ధికి రూ. 67వేల కోట్లు ఖర్చు చేయలేదని నిరూపిస్తే దేనికంటే దానికి నేను సిద్ధం. ఏం చేశామో అన్నీ నివేదికలో పెట్టాం. డీఆర్‌ఎఫ్‌ అనేది దేశంలోనే ఎక్కడా లేదు. హైదరాబాద్‌లోనే మొదటిసారి ఏర్పాటుచేశాం. మేం ఆరేండ్లలో ఎన్ని చేశామో ప్రజలకు తెలుసు. విద్యత్‌ విషయంలో 100 శాతం, నీళ్ల విషయంలో 85 శాతం, రోడ్ల విషయంలో 50 శాతం, శానిటేషన్‌ విషయంలో 60 శాతం మేం చేసిన కృషికి సంతృప్తికరంగా ఉన్నాం. కొత్త ఫ్లైఓవర్స్‌, అండర్‌ పాస్‌లు, బ్రిడ్జిల కోసం ఎస్సార్డీపీ కింద రూ.6,000 కోట్లతో పనులు చేస్తున్నాం. మెయిన్‌ రోడ్ల మీద రద్దీ తగ్గించాలని 135 లింకు రోడ్లు నిర్మిస్తున్నాం. ఉన్న రోడ్లు బాగా ఉండటానికి 710 కిలోమీటర్ల మెయిన్‌ రోడ్డును ఆరు భాగాలుగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించి రోడ్లు వేయడంతో పాటు, నిర్వహణ అప్పగించాం. నీరు, తారు శత్రువులు. హైదరాబాద్‌లో రోడ్డు దెబ్బతినకూడదంటే డ్రైనేజ్‌ సిస్టం బాగుండాలి. వచ్చే ఐదేండ్లలో మా ప్రాముఖ్యతలు డ్రైనేజ్‌, మూసి, సీవరేజ్‌, లేక్స్‌.logo