సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 02:16:29

సంక్రాంతికి విజయవాడకు విమానాలు

సంక్రాంతికి విజయవాడకు విమానాలు

హైదరాబాద్‌, జనవరి 3 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా విజయవాడ- హైదరాబాద్‌ల మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు నడుపాలని స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ నిర్ణయించింది. జనవరి 10 నుంచి 31 వరకు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు అదనపు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. సర్వీసు షెడ్యూల్‌ను ఆ సంస్థ ఆదివారం ప్రకటించింది. ప్రతిరోజు సాయంత్రం 4.30కు హైదరాబాద్‌లో బయలుదేరి ఒక సర్వీసు విజయవాడకు 5.30కి వస్తుంది. తిరిగి విజయవాడ నుంచి సాయంత్రం 6 గంటలకు ఇదే సర్వీసు బయలుదేరి హైదరాబాద్‌కు రాత్రి 7.10కి చేరుతుంది. జనవరి 11 నుంచి 28 వరకు మరో కొత్త సర్వీసు ప్రారంభమవుతుంది. విజయవాడలో మధ్యాహ్నం 3.20కి బయలుదేరి, హైదరాబాద్‌కు 4.10కి చేరుతుంది. జనవరి 16 నుంచి మరో సర్వీసు విజయవాడలో బయలుదేరుతుంది. జనవరి 30 వరకు రోజు మధ్యాహ్నం 3.20కి బయలుదేరి 3.55కు హైదరాబాద్‌ వెళ్తుంది.


logo