మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 12:21:56

గద్వాల జిల్లా కేంద్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రారంభం

 గద్వాల జిల్లా కేంద్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రారంభం

జోగులాంబ గద్వాల : అత్యాచారాలు, అమ్మాయిలపై లైంగిక వేధింపులు పోక్సో కేసుల విచారణకై జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో  ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ డిజిటల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి పి. కేశవరావు, డిస్ట్రిక్ట్ జడ్జి (మహబూబ్  నగర్) ప్రేమావతి, జిల్లా కలెక్టర్ శ్రుతి ఓఝా, ఎస్పీ రంజన్ రతన్ కుమార్,  9వ అదనపు డిస్ట్రిక్ట్ జడ్జి వనపర్తి/ గద్వాల 3వ అదనపు జడ్జి శ్రీనివాసులు, గద్వాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.