శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 11:32:32

తిరుమలలో రేపు దివ్యాంగులు, వయోవృద్దులకు ప్రత్యేక దర్శనం

తిరుమలలో రేపు దివ్యాంగులు, వయోవృద్దులకు ప్రత్యేక  దర్శనం

తిరుమల : తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్  లోని 3 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి సుమారుగా 4 గంటల సమయం పట్టవచ్చు. శీఘ్రసర్వదర్శనం (SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ రూ.300/-), దివ్యదర్శనం (కాలినడకన)వారికి శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టే అవకాశముంది. రేపు దివ్యాంగులు, వయోవృద్దులకు ప్రత్యేక దర్శనం కలదు. 18న ఐదేళ్లలోపు వయసున్న చిన్నపిల్లల తల్లితండ్రులకు ప్రత్యేక దర్శనం కలదు. రూ.10,000/- విరాళం ఇచ్చే భక్తులకు..శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన సౌకర్యం కలదు. నిన్న 63,747 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కలిగింది. నిన్నస్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదు రూ.2.51 కోట్లు. నిన్న 17,954 మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది.  

భక్తులకు ముఖ్యగమనిక..

రేపటి నుండి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్  లోని గదులలో వేచి ఉండేందుకు అవకాశం లేదు. టైమ్ స్లాట్ ప్రకారం భక్తులను టైమ్ కి క్యూలో నేరుగా స్వామిదర్శనానికి అనుమతిస్తారు. అస్వస్థతకు లోనైన భక్తులు తిరుమలకి రావొద్దని అధికారులు సూచనలు జారీచేశారు. అస్వస్థతకు గురైన భక్తులు యాత్రను రద్దు చేసుకొని వారి టికెట్లను  [email protected]కి మెయిల్ చేస్తే మరో రోజు దర్శనం ఏర్పాటు చేయడం కానీ లేదా నగదు తిరిగి చెల్లించడం కానీ జరుగుతుందని చెప్పారు. భక్తులు సహకరించాలని  అధికారులు కోరారు. విదేశాల నుండి వచ్చిన వారు 28 రోజుల వరకు తిరుమల యాత్రకు రావొద్దని అధికారులు సూచించారు. అలిపిరి, శ్రీవారి మెట్టు, టోల్ గేట్ వద్ద భక్తులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. 


logo