హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి చిత్రారామచంద్రన్ శుక్రవారం పదవీ విరమణ పొందారు. 1985 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె ఉమ్మడి ఏపీ, తెలంగాణలో పలు కీలక పోస్టుల్లో పనిచేశారు. అసిస్టెంట్ కలెక్టర్‌గా సర్వీసులోకి వచ్చిన ఆమె.. ఆర్థికశాఖ, పౌరసరఫరాలశాఖ, వ్యవసాయశాఖ, క్రీడలు యువజన సర్వీసులు, రవాణా, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధిశాఖల్లో పలు హోదాల్లో పనిచేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సేవలందించారు. గతేడాది ఫిబ్రవరి నుంచి విద్యాశాఖ స్పెషల్ సీఎస్‌గా పనిచేస్తున్నారు. చిత్రా రామచంద్రన్‌ను శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఘనంగా సన్మానించారు. ఆమె సేవలను కొనియాడారు. ఇంటర్ విద్యా జేఏసీ నేతలు సైతం చిత్రారామచంద్రన్‌ను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.
సుల్తానియాకు అదనపు బాధ్యతలు
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ శుక్రవారం జీవో ఉత్తర్వులిచ్చారు.