మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 19:40:49

కరోనాతో మరణించిన వారి దహన సంస్కారాల కోసం ప్రత్యేక శ్మశాన వాటికలు

కరోనాతో మరణించిన వారి దహన సంస్కారాల కోసం ప్రత్యేక శ్మశాన వాటికలు

వరంగల్ అర్బన్ : కరోనా వైరస్ తో మరణించిన వారి దహనానికి ప్రత్యేకంగా శ్మశాన వాటికల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని  వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయం లో సంబంధిత అధికారులతో జరిగిన సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. నగరంలో  కరోనాతో చనిపోయిన వారిని సాధారణంగా వారి శ్మశాన వాటికలలో దహనం చేయుటకు ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో వెంటనే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ ల కోసం వేర్వేరుగా ప్రత్యేక స్థలాలను గుర్తించాలన్నారు. మృతదేహాలను శ్మశాన  వాటికలకు తరలించడానికి అంబులెన్సును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాల దహనం సాఫీగా జరుపుకునేందుకు ,వారి సంబంధికులకు సహకరించడానికి డీఎఫ్ ఓ కిశోర్ ఆధ్వర్యంలో 12 మంది సిబ్బందిచే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

బల్దియాలోని కరోనాతో బాధపడుతున్న క్రింది స్థాయి ఉద్యోగులకు హోమ్ క్వారన్ టైన్ నిమిత్తం మున్సిపల్ అతిధి గృహాన్ని, హన్మకొండ మచిలీబజార్ లోని కమ్యూనిటీ హాళ్లను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆవసరమైతే వారికి బల్దియా ఆధ్వర్యంలో భోజనం సౌకర్యం కల్పించనున్నట్లు కమిషనర్ తెలిపారు. సమావేశంలో అదనపు కమిషనర్ సీహెచ్. నాగేశ్వర్, ఇన్ చార్జి ఆరోగ్య అధికారి జీవీ నారాయణ రావు, డిప్యూటీ కమిషనర్ రాజు టీపీఎఫ్ వో విజయ లక్ష్మి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


logo