శుక్రవారం 29 మే 2020
Telangana - Feb 17, 2020 , 11:28:18

శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు

శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌ : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పికెట్‌ డిపో మేనేజర్‌ ప్రణీత్‌ వెల్లడించారు. రేపట్నుంచి ఈ నెల 23 వరకు జేబీఎస్‌ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ప్రతి 20 నిమిషాలకు ఒక ప్రత్యేక బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు డిపో మేనేజర్‌ తెలిపారు. తిరుగు ప్రయాణంలో భాగంగా శ్రీశైలం నుంచి జేబీఎస్‌కు 21వ తేదీ నుంచి 23 వరకు బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. 


logo