ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 17, 2021 , 07:16:31

23 వరకు ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక బస్‌పాస్‌ కౌంటర్‌

23 వరకు ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక బస్‌పాస్‌ కౌంటర్‌

హైదరాబాద్: పాత్రికేయుల సౌకర్యార్థం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక బస్‌పాస్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. జర్నలిస్టులకు సంబంధించిన బస్‌పాస్‌ గడువు 2020 డిసెంబర్‌ 31వ తేదీతో పూర్తయింది. దీంతో వారందరూ తిరిగి రెన్యువల్‌ చేయించుకోవాల్సిన నేపథ్యంలో ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేకంగా కౌంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. అక్కడే కాకుండా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 33 కేంద్రాల వద్ద బస్‌పాస్‌లను రెన్యువల్‌ చేసుకోవచ్చని, అందుకు గడువు ముగిసిన బస్‌పాస్‌ను కేంద్రంలో అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్లెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో ఉద యం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.  

VIDEOS

logo