శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 07:35:46

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ప్రత్యేక పురస్కారం

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ప్రత్యేక పురస్కారం

హైదరాబాద్‌ :  రోడ్లు, భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఫెలో ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్‌ సభ్యత్వ సర్టిఫికెట్‌ ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని ఆయన అధికారిక నివాసంలో మంత్రిని కలిసిన ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్‌ సంస్థ చైర్మన్‌ రామేశ్వర్‌రావు సర్టిఫికెట్‌ను అందజేశారు. నిర్మాణ రంగంలో ప్రముఖ సివిల్‌ ఇంజినీర్‌గా తనదైన ముద్ర వేసుకున్నందుకుగాను వేముల ప్రశాంత్‌రెడ్డికి ఈ గుర్తింపును ఇచ్చామని రామేశ్వర్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్‌, ప్రతినిధులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

నిరుద్యోగుల పాలిట కల్పవల్లి.. న్యాక్‌

నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పిస్తున్న ఏకైక సంస్థ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌) అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తోన్న అద్భుతమైన నిర్మాణరంగ సంస్థ న్యాక్‌ అని కొనియాడారు.  న్యాక్‌ 22వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సంస్థ ఉద్యోగులు, ట్రైనీస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్‌ఆండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీల్‌ శర్మ, న్యాక్‌ డీజీ భిక్షపతి, ఆడిట్‌ కమిషన్‌ చైర్మన్‌ ఎస్‌ఎన్‌రెడ్డి పాల్గొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo