సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 01:05:42

కరోనా బాధితులకు ప్రత్యేక అంబులెన్స్‌లు

కరోనా బాధితులకు ప్రత్యేక అంబులెన్స్‌లు

మెహిదీపట్నం: కరోనా అనుమానితులు, బాధితుల కోసం హైదరాబాద్‌ నగరంలో ప్రత్యేకంగా 108 వాహనాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ వాహనాల్లో అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌కిట్‌లను అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో సోమవారం నుంచే ప్రత్యేక అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచనున్నట్టు సమాచారం. నగరంలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాల్లో ఈ అంబులెన్స్‌లను ఏర్పాటుచేయనున్నారు. logo