సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 11:16:29

మురికికాలువలో చెత్త వేస్తే జరిమానా: స్పీకర్ పోచారం

మురికికాలువలో చెత్త వేస్తే జరిమానా: స్పీకర్ పోచారం

కామారెడ్డి: బాన్సువాడ పట్టణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ప్రధాన రహదారి వెంట అధికారులతో స్పీకర్ పోచారం కలియతిరిగారు. దుకాణ సముదాయ వ్యాపారులకు..ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఓ దుకాణం ముందు మురికాకాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్నిపరిశీలించారు.

దుకాణ షాపుల యజమానులు, ప్రజలు మురికికాలువలో చెత్తవేయడం ద్వారా..ఎక్కడిక్కడ నీరు నిలిచిపోతుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దుకాణాల ముందు చెత్తాచెదారం ఉంటే కొత్త మున్సిపల్ చట్టం క్రింద జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. మనకు వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మన ఊరు శుభ్రంగా ఉండాలి. చెత్తవేయకుండా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే ఊరు, పట్టణం శుభ్రంగా పట్టణం శుభ్రంగా ఉంటుందని..దీనికి ప్రజలందరి సహకారం కావాలని కోరారు. స్పీకర్ పోచారం వెంట ఆర్డీవోతోపాటు పలువురు అధికారులున్నారు.


logo