బుధవారం 20 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 08:05:56

స్పీక‌ర్ పోచారం ఐదు వ‌ర‌కు ఎక్క‌డ చ‌దువుకున్నాడో తెలుసా?

స్పీక‌ర్ పోచారం ఐదు వ‌ర‌కు ఎక్క‌డ చ‌దువుకున్నాడో తెలుసా?

బాన్సువాడ రూరల్ : తాను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలను చూసి.. రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌లో తాను ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవానికి స్పీకర్‌ వచ్చారు. ఈ సందర్భంగా తాను చదువుకున్న పాఠశాల గది వద్ద ఆగారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన గదినే చూస్తూ అక్కడే కొద్దిసేపు నిల్చుండి పోయారు. పక్కనే ఉన్న జేసీ యాదిరెడ్డి, డీఎస్పీ జైపాల్‌రెడ్డి, నాయకులతో ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ‘డీఎస్పీ గారూ.. ఒకటో తరగతి నుంచి ఐదోతరగతి వరకు నేను ఇక్కడే చదువుకున్న. ఇదిగో ఈ గదిలోనే ఐదేండ్లు చదువుకున్నం. మా గురువు మోజెస్‌ సార్‌ విద్యాబుద్ధులు నేర్పారు’ అని స్పీకర్‌ గుర్తుచేసుకున్నారు. తాను చదువుకున్న పాఠశాలలోనే స్పీకర్‌గా అదనపు తరగతి గదులను ప్రారంభించడం గర్వంగా ఉందని సంతోషం వ్యక్తంచేశారు.logo