శనివారం 11 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 12:21:30

మానవ మనుగడకు చెట్లే ఆధారం: స్పీకర్‌ పోచారం

మానవ మనుగడకు చెట్లే ఆధారం: స్పీకర్‌ పోచారం

హైదరాబాద్‌: మానవ మనుగడకు చెట్లు అతిముఖ్యమైనవని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో 33 శాతం అడవులను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని చెప్పారు. స్పీకర్‌ ఈరోజు కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. హరితహారంలో భాగంగా గాంధారి ఎక్స్‌రోడ్‌ నుంచి బాన్సువాడ వరకు 48 కి.మీ.ల మేర మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధారి రోడ్డు కూడలి వద్ద మొక్కలు నాటారు. ఈ క్యాక్రమంలో ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే సురేందర్‌ పాల్గొన్నారు. 

ఐదేండ్లుగా నాటిన మొక్కలను కాపాడుతూ, కొత్త మొక్కలు నాటాలని సూచించారు. హరితహారం కార్యక్రమం ఆగస్టు వరకు కొనసాగుతుందని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో అడవులు తగ్గిపోయాయని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటివరకు 172 కోట్ల మొక్కలు నాటామని, ఈ ఏడాది మరో 30 కోట్ల మొక్కలు నాటుతామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 65 లక్షల మొక్కలు నాటనున్నామని ప్రకటించారు. 


logo