గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 10, 2020 , 16:15:08

అంబులెన్స్ లను ప్రారంభించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

అంబులెన్స్ లను ప్రారంభించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన ‘గిఫ్ట్ ఎ స్మైల్’  కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, సత్యవ‌తి రాథోడ్ ఆధ్వర్యంలో..ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా శాసన సభ్యులు అందించిన అంబులెన్స్ లను శాసన సభ స్పీకర్  పోచారం శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మంత్రులు స‌హా శాస‌న స‌భ్యులంతా క‌లిసి మొత్తం 14 అంబులెన్స్ వాహ‌నాల‌ను స‌మ‌కూర్చారు.

ఆయా వాహ‌నాల‌ను వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌రోనా బాధితుల కోసం వినియోగిస్తారు. వీటిని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లోని వైద్యశాల‌ల‌కు అప్పగిస్తారు. ఈ వాహ‌నాల్లో ఆక్సిజ‌న్, వెంటిలేట‌ర్ స‌హా అత్యాధునిక స‌దుపాయాల‌ను క‌ల్పించారు. క‌రోనా బారిన ప‌డిన సీరియ‌స్ పేషంట్లకు అవ‌స‌ర‌మైన స‌దుపాయ‌లన్నీ అందులో ఉన్నాయి. 


logo