ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 04, 2020 , 15:21:27

బడ్జెట్ సమావేశాలపై స్పీకర్ సమీక్ష

బడ్జెట్ సమావేశాలపై స్పీకర్ సమీక్ష

హైదరాబాద్ : ఈ నెల 6వ తేదీ నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు అంజనీ కుమార్, మహేశ్ భగవత్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర శాసనసభ జరిగే తీరు దేశంలోనే ఆదర్శంగా ఉండాలి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే విధంగా జరుగుతున్న శాసనసభ సమావేశాలను ప్రజలు గమనిస్తుంటారు. సభ సజావుగా జరగడానికి సభ్యులు, అధికారుల మధ్య ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి. 

తెలంగాణ పోలీసు శాఖ సమర్ధవంతమైన పనితీరుతో గత సమావేశాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా జరిగాయన్నారు. ఈ సమావేశాలు కూడా సజావుగా జరగడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఇతర రాష్ట్రాలలో  చట్టసభలు జరుగుతున్న సమయంలో చోటుచేసుకుంటున్న అవాంచనీయ సంఘటనలు ఇక్కడ జరగడం లేదు.  రాష్ట్ర స్థాయిలో సమర్ధవంతమైన నాయకత్వం ఉంటే ఫలితాలు ఎంత బాగుంటాయో తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం అని స్పీకర్ పేర్కొన్నారు.


logo