సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 21:36:33

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్‌ పోచారం, మంత్రి ఈటల

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్‌ పోచారం, మంత్రి ఈటల

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ఈటల రాజేందర్‌రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగ జరుపుకుంటారని ఆయన తెలిపారు. చీకటిని పారద్రోలి వెలుతురు అందించే పండుగ దీపావళి అని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ ఈ పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు. పిల్లలు పటాకులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.