గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 10, 2020 , 14:49:22

అంబులెన్స్‌ల‌ను ప్రారంభించిన స్పీక‌ర్ పోచారం, మంత్రి కేటీఆర్

అంబులెన్స్‌ల‌ను ప్రారంభించిన స్పీక‌ర్ పోచారం, మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌ పేరుతో ప్రభుత్వానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంబులెన్స్‌లను అందజేస్తున్న విషయం తెలిసిందే. గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా ఇవాళ 10 అంబులెన్స్‌లను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో క‌లిసి మంత్రి కేటీఆర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌లను కొవిడ్‌ సహాయక చర్యలకు.. మంత్రులు సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్, ఎమ్మెల్యేలు మాధ‌వ‌రం కృష్ణారావు, శంక‌ర్ నాయ‌క్, ఎమ్మెల్సీ క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి, స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌భుత్వానికి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రికీ కేటీఆర్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


logo