శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 01:35:41

పేదల సొంతింటి కల సాకారం

పేదల సొంతింటి కల సాకారం

  • స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి 

నస్రుల్లాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులతో పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లను అందజేసి  వారి సొంతింటి కలను సాకారం చేస్తున్నదని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మం డలం బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామంలో రూ. 2.51 కోట్లతో నిర్మించిన 40 డబుల్‌ బెడ్రూం ఇండ్ల ను శనివారం స్పీకర్‌ ప్రారంభించారు. రైతులు అప్పులపాలు కాకుండా సీఎం కేసీఆర్‌ అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. బాన్సువాడలో మహిళల కోసం రూ.17 కోట్ల తో 100 పడకల మాతా శిశు దవాఖానను నిర్మించనున్నట్లు స్పీకర్‌ తెలిపారు. అనంతరం గ్రామంలో మైకో సీడ్‌ వారి సహకారంతో రూ. 5 లక్షలతో నిర్మించిన బస్టాండ్‌ను, రూ. 7లక్షలతో నిర్మించిన ముదిరాజ్‌ సంఘ భవనాన్ని ప్రారంభించారు. స్పీకర్‌ వెంట డీసీసీబీ చైర్మ న్‌ పోచారం భాస్కర్‌రెడ్డి ఉన్నారు.కాగా నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం బీబీపూర్‌ తండా లో నిర్మించిన 50 డబుల్‌బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్సీ వీజీగౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ లబ్ధిదారులకు అందజేశారు.logo