కొండాపూర్, జూన్ 8 : బ్లాక్‌ఫంగస్ చికిత్స కోసం ఎమల్షన్ ఆధారిత ఔషధాన్ని మార్కెట్లోకి విడుదలచేసినట్టు సెలోన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం నగేశ్‌కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన స్పెషాలిటీ బయో ఫార్మాస్యూటికల్ తయారీదారు సెలోన్ ల్యాబొరేటరీస్ ముకోర్మైకోసిస్ చికిత్స కోసం ప్రత్యామ్నాయ ఔషధమైన యాంఫోటెరిసిన్ బీ ఎమల్షన్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ముకోర్మైకోసిస్‌ను సాధారణ భాషలో బ్లాక్‌ఫంగస్‌గా పిలుస్తారని పేర్కొన్నారు. కాగా, గతవారమే ప్రభుత్వం నుంచి ఔషధానికి అనుమతులు లభించాయని, తెలంగాణలో జయ సర్జికల్స్ ద్వారా వీటిని సరఫరా చేయనున్నట్టు వివరించారు. రాష్ట్రంలో తగినంత నిల్వలు సమకూర్చాకే సెలోన్ ఔషధాన్ని ఇతర రాష్ర్టాలకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. సెలోన్ ప్రతిరోజూ 10వేల వయల్స్‌ను తయారు చేస్తుందని.. నెలకు 6 వేల మంది రోగులకు ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. ఒక్కో వాయిల్ ధర రూ.4,250గా నిర్ణయించినట్టు, వివరాల కోసం 9959154371, 9963980259లలో సంప్రదించవచ్చని సూచించారు.