మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 06, 2020 , 04:05:49

దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్‌ రైలు

దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్‌ రైలు

  • హైదరాబాద్‌ నుంచి న్యూఢిల్లీకి పయనం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దక్షిణమధ్య రైల్వేనుంచి తొలి కార్గో ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించింది. బుధవారం సనత్‌నగర్‌ నుంచి బయలుదేరిన రైలు శుక్రవారం న్యూఢిల్లీలోని ఆదర్శ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ మార్గంలో ప్రయోగాత్మకంగా ఆరునెలలపాటు కార్గో రైలు ను నడిపించనున్నారు. టైంటేబుల్‌ ఎక్స్‌ప్రెస్‌గా ఉండే ఈ రైలు వారానికి ఒకసారి నడువనున్నది. రోడ్డు రవాణా లేదా రైల్వే పార్శిల్‌ చార్జీలతో పోల్చితే కార్గో ఎక్స్‌ప్రెస్‌ ద్వారా40 శాతం తక్కువ ధరకే వేగవంతమైన రవాణా సదుపాయం అందనున్నది. రైల్వే ద్వారా సరుకు రవాణా భద్రతతో కూడుకొన్నదని దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్య తెలిపారు.  


logo