శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 01:02:20

ప్రయాణికులు లేక 12 రైళ్లు రద్దు

ప్రయాణికులు లేక 12 రైళ్లు రద్దు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత వా హనాల్లో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు.  రైళ్లు, ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో చాలాతక్కువ మంది ప్రయాణిస్తున్నారు. రైల్వేశాఖ ప్ర యాణికుల అవసరాలకు అనుగుణంగా కొద్దికొద్దిగా రైళ్ల సంఖ్యను పెంచినా ఆదరణ లభించడంలేదు. ఈ నేపథ్యంలో గురువారం పలు ప్రాంతాల్లో ప్రయాణించాల్సిన రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. కరోనాకు ముందు ఈ మార్గాల్లో వెళ్లే రైళ్లలో ప్రజలు పెద్దఎత్తున ప్రయాణించేవారు. రద్దు చేసిన రైళ్లలో.. విశాఖపట్నం- విజయవాడ, విజయవాడ- విశాఖపట్నం, నాదేండ్‌- పాన్వెల్‌, పాన్వెల్‌- నాందేడ్‌, ధర్మాబాద్‌- మన్మాడ్‌, మన్మాడ్‌- ధర్మాబాద్‌, తిరుపతి- కొల్హాపూర్‌, కొల్హాపూర్‌- తిరుపతి, కాచిగూడ- నార్కే ర్‌,  నార్కేర్‌-కాచిగూడ, కాచిగూడ- అకోలా, అకోలా- కాచిగూడ ఉన్నాయి.