ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 15:03:15

మెడికల్‌ వ్యాపారి ఇంట్లో ఎస్‌వోటీ పోలీసుల సోదాలు

మెడికల్‌ వ్యాపారి ఇంట్లో ఎస్‌వోటీ పోలీసుల సోదాలు

హైదరాబాద్‌ : నగరంలోని చైతన్యపురిలో గల ఓ మెడికల్‌ వ్యాపారి ఇంట్లో పోలీసులు నేడు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా మాస్కులు, శానిటైజర్లు నిల్వ ఉంచారనే సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపిన తనిఖీల్లో పెద్దఎత్తున మాస్కులు, శానిటైజర్లను ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం మెడికల్‌ వ్యాపారి మాణిక్యాలరావును చైతన్యపురి పోలీసులకు అప్పగించారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo