బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 12:52:33

కృష్ణానగర్‌లో వరద సమస్యకు త్వరలో పరిష్కారం

కృష్ణానగర్‌లో వరద సమస్యకు త్వరలో పరిష్కారం

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆదివారం పర్యటించారు. యూసుఫ్ గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందిస్తామని తెలిపారు. కృష్ణానగర్‌లో వరద సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. పోలీస్ లైన్స్ నుంచి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం దాకా వరద నీరు వెళ్లేలా లైన్ వేయిస్తే సమస్య తీరుతుందన్నారు.

దీనికోసం రూ.49 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎల్లారెడ్డి గూడ నుంచి అమీర్ పెట్ వెళ్లే నాలా ప్రహరీ కూలడంతో అంబేడ్కర్ నగర్‌తో సహా పలు బస్తీల్లో ఇండ్లలోకి నీళ్లు చేరాయయని తెలిపారు. ఈ ప్రహరీ నిర్మాణం కోసం రూ.1.2 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని సాధ్యమైనంత త్వరగా పనులు చేస్తామని పేర్కొన్నారు.logo