గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 03:32:03

చిన్నారులకు సోనూసూద్‌ అండ

చిన్నారులకు సోనూసూద్‌ అండ

  • తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన 

యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)కు చెందిన ముగ్గురు చిన్నారులకు నటుడు సోనూసూద్‌ అండగా నిలిచారు. ‘వారు అనాథలు కాదు.. నేను ఆదుకుంటా’నంటూ శుక్రవారం ఆయన ట్విట్టర్‌లో తెలిపారు. ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురించిన కథనంతోపాటు పలు న్యూస్‌ చానళ్లలో వచ్చిన కథనాలకు సోనూసూద్‌ స్పందించారు. మనోహర్‌, యశ్వంత్‌, లాస్యలకు తల్లిదండ్రులు లేని లోటు తీర్చడంతోపాటు వారి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని స్పష్టంచేశారు.  - ఆత్మకూరు(ఎం)


logo