బుధవారం 03 జూన్ 2020
Telangana - May 22, 2020 , 19:18:13

‘కరోనా వారియర్స్‌' పాటను విడుదల చేసిన డీజీపీ

‘కరోనా వారియర్స్‌' పాటను విడుదల చేసిన డీజీపీ

హైదరాబాద్ : కరోనా విలయతాండవంపై ఇప్పటికే చాలా పాఠాలు వచ్చాయి. ప్రజలను అప్రమత్తం చేసేలా, అవగాహన కల్పించేలా కళాకారులు పాటలను రూపొందించారు. తాజాగా సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ కరోనాపై పోరాడుతున్న పోలీసుల శాఖ సేవలను ప్రశంసిస్తూ అద్భుతమైన గీతాన్ని అందించారు. ఈ గేయాన్ని రాష్ర్ట డీజీపీ మహేందర్ రెడ్డి తన కార్యాలయంలో శుక్రవారం విడుదల చేశారు. పోలీసులు, వైద్యులు, మున్సిపల్‌ తదితర శాఖల సిబ్బంది అందిస్తున్న కృషిని ప్రోత్సహించేలా పాటను రూపొందించడంపై మహిత్‌నారాయణ్‌, ఆయన బృందాన్ని డీజీపీ అభినందించారు.


logo