బుధవారం 03 జూన్ 2020
Telangana - May 05, 2020 , 01:29:38

ఆఖరి చూపూ కరువై..

ఆఖరి చూపూ కరువై..

  • అనారోగ్యంతో తండ్రి మృతి
  • గల్ఫ్‌లోనే ఉండిపోయిన కొడుకులు
  • అంత్యక్రియలు పూర్తిచేసిన తల్లి 

దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన రైతు ఎర్రం సత్తయ్య(54) అనారోగ్యంతో శనివారం మృతిచెందాడు. సత్తయ్య ఇద్దరు కుమారులు ఎర్రం మల్లేశ్‌, అంజన్న ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లారు. లాక్‌డౌన్‌ కారణంగా వారు రాలేని పరిస్థితి. సత్తయ్య ఒక్కగానొక్క కూతురు గర్భిణి కావడంతో భార్య కళావతి అంత్యక్రియలను పూర్తి చేసింది. తండ్రి చివరి చూపునకు కూడా పిల్లలు నోచుకోకపోవడం.. వీడియో కాల్‌ ద్వారా అంత్యక్రియలు చూడాల్సిరావడం కుటుంబసభ్యులతోపాటు బంధువులను కంటతడి పెట్టించింది. 

గుండె పగిలినంత పనైతుంది..

‘మేము అనారోగ్యంతో ఉన్నా.. మాకు ధైర్యం చెప్పేటోడు. ఇప్పుడు నాన్న మాకు దూరమైండు. కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోయాం. అమ్మ, చెల్లి ఏడుస్తూ మాట్లాడుతుంటే గుండె పగిలినంత పనైతుంది. మమ్మల్ని ఇంటికి రప్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాం.  

-మల్లేశ్‌, అంజన్న (సత్తయ్య కుమారులు)


logo